Roja: తప్పు మీది కాదు... ఈవీఎంలది: రోజా

Roja slams AP Govt

  • కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు
  • రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారని వెల్లడి
  • స్కూళ్లను కూడా ఎత్తివేస్తున్నారంటూ విమర్శలు
  • బాగుందయ్యా బాగుంది అంటూ వ్యంగ్యం

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలకు మంగళం పాడేశారని, రైతు భరోసా కేంద్రాలను కూడా ఎత్తివేస్తున్నారని, ఇప్పుడు పాఠశాలల వంతు వచ్చిందని పేర్కొన్నారు. అయినా, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని మీరు ముందే చెప్పారు లెండి... తప్పు మీది కాదు, తప్పంతా ఈవీఎంలదే అని ఎద్దేవా చేశారు. 

"ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా...? గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండొచ్చా...? బాగుందయ్యా బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది" అంటూ రోజా సోషల్ మీడియాలో స్పందించారు.

  • Loading...

More Telugu News