Telangana Govt: తెలంగాణ శాసనసభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, ఎస్‌సీ వర్గీకరణ, దేవాదాయ చట్ట సవరణపై బిల్లులను ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు.
అలాగే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, ఈ బిల్లులకు సభలో ఆమోదం లభించింది.