Shivaji: హీరోగా రాని స్టార్ డమ్ .. విలన్ గా వచ్చింది: శివాజీ

Shivaji Interview

  • పోయిన శుక్రవారం విడుదలైన 'కోర్ట్'
  • విలన్ గా మంచి మార్కులు కొట్టేసిన శివాజీ
  • తన ముచ్చట తీరిందని వెల్లడి 
  • ఇకపై పవర్ఫుల్ విలన్ రోల్స్ చేస్తానని వ్యాఖ్య


'కోర్ట్' .. ఇప్పుడు అందరూ ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. పోయిన శుక్రవారం విడుదలైన ఈ సినిమా, నాని బ్యానర్ కి పెద్ద హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన శివాజీకి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ ఈ సినిమాను గురించి మాట్లాడారు. "గతంలో హీరోగా చాలా సినిమాలు చేశాను .. ఎంతో అంకితభావంతో కష్టపడ్డాను. అయినా నేను ఆశించిన స్టార్ డమ్ రాలేదు" అని అన్నారు. 

" ఎంతగా కష్టపడుతున్నా స్టార్ డమ్ రాకపోవడంతో, నాలో బాధ .. కసి పెరుగుతూ వెళ్లాయి. నాలో అదే పనిగా అంతర్మథనం జరుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితులలో నా దగ్గరికి 'మంగపతి' పాత్ర వచ్చింది. కథ వినగానే నన్ను మంగపతి పూనేశాడు. ఇంత కాలంగా మనం ఎదురుచూస్తున్నది ఇలాంటి రోల్ కోసమే కదా అనిపించింది. అందుకే ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఓకే చెప్పేశాను" అని అన్నారు. 

"చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్వీ రంగారావు .. రావుగోపాలరావు .. నాగభూషణం .. నూతన్  ప్రసాద్ వంటి వారి విలనిజాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను. డైలాగ్స్ తోనే వాళ్లంతా గొప్ప విలనిజాన్ని పండించారు. అలాంటి ఒక పాత్ర చేయాలనుకున్న నాకు ఈ సినిమాతో ఆ ముచ్చట తీరింది. హీరోగా నేను అనుకున్న స్టార్ డమ్ ను విలన్ రోల్ తెచ్చిపెట్టడం విశేషం. ఇకపై పవర్ ఫుల్ విలన్ రోల్స్ వస్తాయని ఆశిస్తున్నాను" అని అన్నారు. 


  • Loading...

More Telugu News