Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

disruption to train services

  • అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో కుంగిన రైల్వే వంతెన
  • అండర్ బ్రిడ్జి వద్ద గడ్డర్ ను ఢీకొట్టిన భారీ వాహనం
  • మరో ట్రాక్ పైనుంచి రైళ్ల రాకపోకలను పునరుద్దరించిన అధికారులు

రైల్వే వంతెన కుంగిపోవడంతో విశాఖ – విజయవాడ మార్గంలో ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా విజయరామరాజు పేటలో రైల్వే వంతెన కుంగింది. ఆదివారం రాత్రి భారీ వాహనం ఒకటి వంతెన కింద నుంచి వెళుతూ గడ్డర్‌ను ఢీకొట్టింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. 
 
దీంతో కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. ఎలమంచిలిలో మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైనుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే‌ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News