Nitin Gadkari: కులం గురించి మాట్లాడితే సహించేది లేదు: గడ్కరీ

- ఎవరైనా కుల వివక్ష గురించి మాట్లాడితే సహించేదిలేదన్న నితిన్ గడ్కరీ
- కుల మతాలు, భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరిపైనా వివక్ష చూపరాదని సూచన
- కులం, మతం, భాష ఆధారంగా ఎవరూ గొప్పవారు కాలేరన్న గడ్కరీ
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కుల వివక్షపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాగపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కుల వివక్ష గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. కుల మతాలు, భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరిపైనా వివక్ష చూపరాదని అన్నారు.
ఎవరైనా కులం, మతం, భాష ఆధారంగా గొప్పవారు కాలేరని, వారికి ఉన్న గుణాలతోనే గొప్ప వారు అవుతారని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి కులమతాలు, భాష, లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్ప వారు కాగలరని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తిదాయకమని గడ్కరీ పేర్కొన్నారు.