Vishwak Sen: విష్వక్సేన్ నివాసంలో చోరీ!

theft in actor vishwak sens house

  • విశ్వక్ సోదరి గదిలోని బంగారు అభరణాలు చోరీ
  • విశ్వక్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • సోషల్ మీడియాలో చోరీ వార్త వైరల్

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి రెండు డైమండ్ రింగ్ లు సహా రూ.2.20 లక్షల విలువైన అభరణాలు అపహరించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ నివాసంలో చోరీ జరగ్గా, ఆయన తండ్రి కరాటే రాజు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వక్ కుటుంబం అంతా ఒకే నివాసంలో ఉంటుండగా, అతని సోదరి వన్మయ బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది. ఆదివారం వేకువజామున తన గదిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటం గమనించిన వన్మయ అనుమానం వచ్చి బీరువా తనిఖీ చేయగా, అందులో ఉండాల్సిన నగలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.  

విశ్వక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఆ ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. వేకువజామున ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి విశ్వక్ ఇంట్లోకి ప్రవేశించినట్లు రికార్డు అయింది. ఆ దొంగ కేవలం 20 నిమిషాల్లోనే చోరీ పూర్తి చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు .. ఇది బాగా తెలిసిన వ్యక్తి పని అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

Vishwak Sen
Theft
Filmnagar
Hyderabad
  • Loading...

More Telugu News