Kalyan Ram: ఆమెను 'అమ్మ' అనే పిలుస్తాను: నందమూరి కల్యాణ్ రామ్

Kalyan Ram talks about Vijayasanthi

  • కల్యాణ్ రామ్, విజయశాంతి కాంబోలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి
  • నూతన దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్ లో చిత్రం
  • ఈ సినిమాతో విజయశాంతితో తన అనుబంధం బలపడిందన్న కల్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్... విజయశాంతి గురించి మాట్లాడుతూ ఆమెను 'అమ్మ' అని పిలుస్తానని, ఈ సినిమాతో తమ మధ్య అనుబంధం మరింత బలపడిందని అన్నారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తల్లీకొడుకుల మధ్య ప్రేమ, అనుబంధాల గురించి ఈ సినిమాలో చూపించామని తెలిపారు. దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు విజయశాంతి గారినే ఆ పాత్రలో ఊహించుకున్నానని ఆయన అన్నారు. కర్తవ్యం సినిమాలోని వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా కథను రూపొందించామని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. విజయశాంతి ఈ సినిమాకు ప్రధాన బలం అని, ఆమె పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని కొనియాడారు.

విజయశాంతి మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారని, ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడు ప్రదీప్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రంలో నటించారని ఆమె ప్రశంసించారు. రాజకీయాల్లో ఉన్న విజయశాంతి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమె 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో నటించారు. ఈ సినిమా టీజర్ సోమవారం ఉదయం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News