Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం!

- ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
- భూమికి తిరిగి వచ్చేందుకు 9 నెలలుగా నిరీక్షణ
- ఎట్టకేలకు ఐఎస్ఎస్ ను చేరుకున్న డ్రాగన్ వ్యోమనౌక
మనం కాసేపు ఏదైనా పని చేస్తేనే బోర్ ఫీలవుతుంటాం. ఒంటరిగా ఉంటే ఆ విసుగు మరింత ఎక్కువగా ఉంటుంది. పాపం... అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఏకంగా 9 నెలల పాటు మూడో మనిషి లేకుండా గడపడం ఎంత దుర్భరమో చెప్పలేం.
ఓ అంతరిక్ష మిషన్ కోసం రోదసిలోని ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీతా, విల్మోర్... వారిని తిరిగి తీసుకువచ్చే వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఇన్నాళ్లకు, వారి నిరీక్షణ ఫలించి డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్ ను చేరుకుంది.
ఆ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ కు చేరుకున్న క్రూ-10 వ్యోమగాములను చూశాక సునీతా విలియమ్స్ ఆనందం వర్ణనాతీతం. ఆమె ముఖం నవ్వులతో వెలిగిపోయింది. సునీతా వారిని ఆప్యాయంగా హత్తుకుని ఐఎస్ఎస్ కు స్వాగతం పలికారు. కెమెరాతో ఫొటోలు తీసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.