Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ

Baidu launches two AI models into fray

  • చాట్ జీపీటీ రాకతో ఏఐ రంగంలో భారీ కుదుపు
  • ఏఐ బాట పడుతున్న టెక్ దిగ్గజాలు
  • తాజాగా ఎర్నీ 4.5, ఎక్స్ 1 మోడళ్లను ఆవిష్కరించిన బైదూ

కృత్రిమ మేథ (ఏఐ) రేసులో ఇటీవల కొత్త మోడళ్ల రాక ఎక్కువైంది. చాట్ జీపీటీ రాకతో ఏఐ రంగంలో పెను సంచలనం నమోదైంది. అక్కడ్నించి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్... ఇలా ప్రఖ్యాత టెక్ సంస్థలన్నీ ఏఐ బాట పట్టాయి. ఈ వరుసలోనే చైనా సెర్చింజన్ సంస్థ బైదూ రెండు కొత్త ఏఐ మోడళ్లను తీసుకువచ్చింది. 

ఎర్నీ 4.5, ఎర్నీ ఎక్స్ 1 పేరిట ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లను ఆవిష్కరించింది. ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించగల సామర్థ్యం తమ ఏఐ మోడళ్లకు ఉందని బైదూ వెల్లడించింది. తమ రెండు ఏఐ మోడళ్లకు మల్టీ మోడల్ సామర్థ్యం ఉందని, అద్భుతమైన మెమరీ, అధిక ఐక్యూ వీటి సొంతం అని పేర్కొంది. టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు... ఇలా అనేక రకాల డేటాను విశ్లేషించగలదని పేర్కొంది.  

ముఖ్యంగా ఎర్నీ ఎక్స్1 మోడల్ ఏ విషయాన్నయినా అర్థం చేసుకుని ప్రణాళికలు రచించగలదని బైదూ వివరించింది. అటానమస్ ఎబిలిటీతో కూడిన తొలి డీప్ థింకింగ్ మోడళ్లలో ఎక్స్1 ఒకటని వెల్లడించింది.

  • Loading...

More Telugu News