Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం

- అమరావతి నిర్మాణం దిశగా కీలక ముందడుగు
- రూ.11 వేల కోట్ల నిధులు అందించనున్న హడ్కో
- జనవరి 22న హడ్కో బోర్డు ఆమోదం తెలిపిన మేరకు నేడు ఒప్పందం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా మరో కీలక ముందుడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నేడు సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ పాల్గొన్నారు. ఒప్పందం మేరకు ఏపీ రాజధాని అమరావతిలోని నిర్మాణాల కోసం రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వనుంది.
జనవరి 22న హడ్కో బోర్డు సమావేశంలో అమరావతికి నిధుల మంజూరుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు నేడు హడ్కో... ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే హడ్కో నిధులు విడుదల చేయనుంది.
