Nara Lokesh: ఏమ్మా... పవనన్న గ్లాసు లేదా...? నారా లోకేశ్ వీడియో పంచుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్

- నిన్న మంగళగిరిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్
- ఆల్ఫా అరేబియన్ హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో భేటీ
- పారిశుద్ధ్య కార్మికులతో సరదాగా మాట్లాడిన వైనం
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిన్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన సంగతి తెలిసిందే. వారితో కలిసి ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద టీ తాగారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియోను మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ వీడియోలో... ఓ పారిశుద్ధ్య కార్మికురాలు లోకేశ్ తో సహా అందరికీ టీ అందిస్తుండగా... ఏమ్మా, పవనన్న గ్లాసు లేదా, ఈ గ్లాసులో ఇచ్చావు... పవనన్న గ్లాసులో ఇవ్వాల్సింది కదా! అంటూ లోకేశ్ సరదాగా మాట్లాడడం చూడొచ్చు. లోకేశ్ మాటలకు అందరూ నవ్వేశారు.