Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..?

Cricketer David Warner Got 3 crores for Robin hood Movie Role

  • నాలుగు రోజులకు రూ. 3 కోట్లు అందుకున్న వార్నర్
  • సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి
  • టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట. ఇక సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ..
ఐపీఎల్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ తరపున డేవిడ్ వార్నర్ సుదీర్ఘంగా ఆడారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ అండ్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసిన వార్నర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్ ను రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. నాలుగు రోజుల షూటింగ్ కు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించారు. కాగా, ఈ నెల 28న రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది.

  • Loading...

More Telugu News