Air Asia: శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్

Air Asia Flight Emergency Landing In Shamshabad Airport

    


ఎయిర్ ఏషియా విమానం ఒకటి గత అర్ధరాత్రి అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు వారు అనుమతినివ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఏషియా అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

  • Loading...

More Telugu News