Pakistan: టీ20ల్లో అత్యంత చెత్త స్కోరు నమోదు చేసిన పాకిస్థాన్

Pakistan slump to their lowest T20I

  • 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో తొలి మ్యాచ్
  • 91 పరుగులకే ఆలౌట్ అయిన పాక్
  • టీ20ల్లో పాక్‌కు ఇదే అత్యల్ప స్కోరు

చెత్త ఆటతీరుతో చాంపియన్స్ ట్రోఫీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ మరోమారు అదే ఆటతీరుతో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో 91 పరుగులకే కుప్పకూలి టీ20ల్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. 

సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో ఆడుతున్న జట్టు తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఖుష్దిల్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఇద్దరు డకౌట్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీ20ల్లో 100 పరుగుల లోపు ఆలౌట్ కావడం పాక్‌కు ఇదే తొలిసారి. 2016 జనవరిలో వెల్లింగ్టన్‌లో కివీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లో పాక్ 101 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యల్పం కాగా, ఇప్పుడు వంద పరుగులు కూడా చేయలేక చతికిల పడింది. 

అనంతరం 92 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 44 పరుగులు చేసి అవుట్ కాగా, ఫిన్ అలెన్ 17, టిమ్ రాబిన్సన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News