Pawan Kalyan: ఇది జగన్మాత ఆదేశం: పవన్ కల్యాణ్

Pawan Kalyan tweet on north and south india

  • ఉత్తరాన పరమశివుని కైలాసం ఉందన్న పవన్ కల్యాణ్
  • కైలాసం, మురుగన్ వెలిసిన ప్రదేశమే భారతదేశమన్న జనసేనాని
  • సోషల్ మీడియాలో ఆసక్తికర స్పందన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉత్తరాదిన ఉన్న హిమాలయాలలో పరమశివుని కైలాసం ఉందని, దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం ఉందని, వారు వెలిసిన ప్రదేశమే ఈ భారతదేశమని పేర్కొన్నారు. ఇది జగన్మాత ఆదేశమంటూ 'ఎక్స్' వేదికగా రాసుకొచ్చారు.

పవన్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో హిందీ భాష నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీయడం, ప్రకాశ్ రాజ్ కౌంటర్లు వేయడం, బీజేపీ నేతలు పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేసిన తాజా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News