BJP: బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం

- ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచన
- ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా సభలో మాట్లాడాలని సూచన
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమైన కేంద్ర మంత్రి, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో, ఏడాదిన్నర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా సభలో మాట్లాడాలని సూచించారు. సభలో మాట్లాడేటప్పుడు భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలని అన్నారు. ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో ప్లాన్ చేసుకొని, అసెంబ్లీలో మాట్లాడే విధంగా సిద్ధం కావాలని సూచించారు.