Fire Accident: మధ్యప్రదేశ్‌లో దారుణం... పసిపాపను తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు

- కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- పాప అనారోగ్యంగా ఉండటంతో భూతవైద్యుడి వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు
- చికిత్సలో భాగంగా మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబం తమ ఆరు నెలల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రఘువీర్ ధాకడ్ అనే తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ చిన్నారిపై చెడు నీడ ఉందని భయపెట్టిన రఘువీర్ భూతవైద్యం ప్రారంభించాడు.
చికిత్సలో భాగంగా మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడదీశారు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడుపు ఆపకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్లు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.