ESA: 10 రోజులు బాత్ టబ్ లో పడుకుంటే చాలు... రూ. 4.72 లక్షలు చెల్లిస్తారు!

ESA pays attractively to volunteers here is why

 


యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అంతరిక్ష ప్రయోగాల కోసం ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా, కేవలం పది రోజులు బాత్ టబ్ వంటి వాటర్ బెడ్ పై పడుకుంటే దాదాపు రూ. 4.72 లక్షలు (5,000 యూరోలు) చెల్లించనున్నారు. ఈ వినూత్న ప్రయోగం ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లో ఉన్న మెడెస్ స్పేస్ క్లినిక్‌లో జరుగుతోంది. 'వివాల్డి' అనే ఈ ప్రయోగంలో, వ్యోమగాముల శరీరాలపై అంతరిక్ష ప్రయాణం కలిగించే ప్రభావాలను అధ్యయనం చేయడానికి వాలంటీర్లను ఎంపిక చేశారు.

ఈ ప్రయోగంలో పాల్గొనేవారు పది రోజుల పాటు నీటితో నిండిన టబ్‌లో పడుకుని ఉండాలి. వారి శరీరం ఛాతీ పైభాగం వరకు నీటిలో మునిగి ఉంటుంది, చేతులు, తల మాత్రం నీటిపైకి ఉంటాయి. ఇలా చేయడం వల్ల వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు కలిగే అనుభూతికి దగ్గరగా ఉంటుందని ESA తెలిపింది. పడుకున్న స్థితిలో ఉండగానే ఆహారం తీసుకోవడానికి తేలియాడే బోర్డును, మెడకు దిండును ఏర్పాటు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తాత్కాలికంగా ఒక ట్రాలీపైకి మారుస్తారు. ఒంటరిగా ఉన్నట్టు అనిపించకుండా వాలంటీర్లు ఫోన్లు వాడుకోవడానికి అనుమతి ఉంది.

పది రోజుల తర్వాత వాలంటీర్లు ఒకసారి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా, అంతరిక్ష వాతావరణానికి శరీరం ఎలా అలవాటు పడుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, వ్యోమగాముల ఆరోగ్యం, పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన నివారణ చర్యలను కూడా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రయోగంలో 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల, 1.65 మీటర్ల నుంచి 1.80 మీటర్ల ఎత్తు ఉన్న పురుషులు మాత్రమే అర్హులు. వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 20 నుంచి 26 మధ్య ఉండాలి. ఎలాంటి అలర్జీలు, ఆహార నియమాలు లేని వారు మాత్రమే ఈ ప్రయోగానికి ఎంపిక చేస్తారు.

  • Loading...

More Telugu News