Fire Accident: కోకాపేటలో అగ్ని ప్రమాదం... ఐటీ ఉద్యోగులకు గాయాలు

Big fire accident in Kokapet

  • సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలింపు
  • సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
  • మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. కోకాపేటలో ఉన్న జీఏఆర్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తోంది.

సైదాబాద్ ఆలయంలో ఉద్యోగిపై దాడి

సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయంలో ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి రసాయనం చల్లి దాడి చేశాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు అకౌంటెంట్ నర్సింగరావును వివరాలు అడుగుతున్నట్లు కెమెరాలో కనిపిస్తోంది. నర్సింగరావు కూర్చొని ఉండగా అతడి తలపై నిందితుడు రసాయన పౌడర్ చల్లి, దాడి చేశాడు. ఈ ఘటనలో నర్సింగరావుకు గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News