Pakistan: పాకిస్థాన్ లో ఆర్మీ కాన్వాయ్ పై మరో దాడి

- చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ మార్గంలో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడి
- పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు సమాచారం
- గత 24 గంటల్లో ఇది రెండో దాడి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో పాక్ ఆర్మీపై మరోసారి దాడి జరిగింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ మార్గంలో పాక్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించినట్టు సమాచారం.
పాకిస్థాన్ బలగాలపై దాడి జరగడం గత 24 గంటల్లో ఇది రెండోసారి. హర్నైలో బాంబ్ డీఫ్యూజ్ స్క్వాడ్ రైల్వే ట్రాక్ ని క్లియర్ చేస్తున్న సమయంలో బాంబు పేలుడు జరిగింది.
ఈ వారం ప్రారంభంలో బోలాన్ ప్రాతంలో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హైజాక్ చేసింది. 200కు పైగా పాకిస్థాన్ సైనికులు, ఐఎస్ఐ సిబ్బందిని బీఎల్ఏ బందీలుగా పట్టుకుంది. తమకు చెందిన ఖైదీలను పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని, లేకపోతే అందరినీ చంపేస్తామని పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం విధించింది. అయితే, తాము విధించిన గడువు ముగియడంతో... 214 మందిని చంపేశామని బీఎల్ఏ ప్రకటించింది.