Pawan Kalyan: జనసేన సభ నుంచి తిరిగి వెళుతూ కార్యకర్త మృతి... పవన్ కల్యాణ్ స్పందన

- నిన్న జనసేన సభకు హాజరైన అడపా దుర్గాప్రసాద్
- సభ నుంచి తిరిగి వెళుతూ హఠాన్మరణం చెందారన్న పవన్ కల్యాణ్
- దుర్గాప్రసాద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడి
నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళుతూ అడపా దుర్గాప్రసాద్ అనే కార్యకర్త మృతి చెందారు. అమలాపురంకు చెందిన దుర్గాప్రసాద్ జనసేన ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళుతూ హఠాన్మరణం చెందారని జనసేన అధినేత, పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మరణవార్త తెలిసి చింతిస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దుర్గాప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. అయితే దుర్గాప్రసాద్ ఎలా చనిపోయారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
