Manchu Vishnu: 'కన్నప్ప'ను నడిపించింది కచ్చితంగా శివలీలనే: మంచు విష్ణు

Manchu Vishnu Interview

  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'కన్నప్ప'
  • సీనియర్ స్టార్స్ కారణంగా పెరిగిన క్రేజ్ 
  • ప్రభాస్ చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నదే అని వెల్లడి 
  • ఏప్రిల్ 25న విడుదల కానున్న సినిమా       


మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి మంచు విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి అనేక విషయాలను ప్రస్తావించారు. "ఈ సినిమా కోసం తనికెళ్ల భరణి గారు కథను ఇచ్చారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూ వచ్చాము. సీనియర్ రైటర్స్ అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నాము" అని అన్నారు. 
 
"ఈ సినిమా పరిధి పెరుగుతూ వెళ్లడం వలన నా ఒక్కడి బలం సరిపోదని అనిపించింది. అందువల్లనే అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ గారి లాంటి వారిని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా నాన్నగారి పట్ల గల గౌరవంతోనే ఈ సినిమాను చేశారు. ప్రభాస్ గారు శివుడిగా కనిపిస్తారనే అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నదే" అని చెప్పారు. 

"ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చూసి అంతా షాక్ అవుతారు. అంతగా ఆ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. నేను పాన్ ఇండియా సినిమా చేయాలి... భారీ వసూళ్లు రాబట్టాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు. 'కన్నప్ప' కథ పట్ల ప్రేమతో చేశాను. ఈ సినిమా కోసం ఇంతమంది అతిరథమహారథులు పని చేయడం చూస్తే, ఇది కచ్చితంగా శివలీలనే అనిపించింది. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాము" అని అన్నారు. 

  • Loading...

More Telugu News