Bandi Sanjay: కేంద్రంపై ఉమ్మేస్తే... ఆకాశంపై ఉమ్మేసినట్టే: బండి సంజయ్

- రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్న బండి సంజయ్
- దమ్ముంటే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సవాల్
- కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపాటు
తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి బాధ లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వరని, రుణమాఫీ చేయరని, పంటనష్టం ఇవ్వరని విమర్శించారు. దమ్ముంటే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఉమ్మేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని చెప్పారు.
కేంద్రంపై, బీజేపీ నేతలపై విమర్శలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాకుండా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించాలని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని చెప్పారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.