Seethakka: రేవంత్ రెడ్డి 'మార్చురీ' అన్న పదం ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నది కాదు: సీతక్క

Seethakka clarification on Revanth Reddy mortuary comments

  • ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్న సీతక్క
  • సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు
  • సోషల్ మీడియాకు హద్దు ఉండాలన్న సీతక్క

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'మార్చురీ' అన్న పదం ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నది కాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం, బాడీ షేమింగ్ చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు చేసిన పోస్టులతో తానూ ఇబ్బందిపడ్డానని అన్నారు.

తనపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యాన్ని కోల్పోయానని అన్నారు. నిజాయతీగా పని చేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు హద్దు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని విమర్శించారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని బీఆర్ఎస్ నమ్ముతున్నట్లుగా ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ అన్నదమ్ములని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News