Srisailam: శ్రీశైలం భక్తులను ముంచేస్తున్న నకిలీ వెబ్ సైట్

- శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు
- నకిలీ వెబ్ సైట్ కు డబ్బులు కూడా చెల్లించిన కొందరు భక్తులు
- శ్రీశైలం వచ్చిన తర్వాత తాము మోసపోయామని గుర్తించిన బాధిత భక్తులు
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం తెరపైకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
కొందరు కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో కొందరు భక్తులు తెలియక ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి, డబ్బులు కూడా చెల్లించారు. శ్రీశైలంకు వచ్చిన తర్వాత తాము మోసపోయామనే విషయాన్ని సదరు భక్తులు గుర్తించారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, నకిలీ వెబ్ సైట్ గుట్టు రట్టయింది. మరోవైపు, ఇలాంటి మోసాలు జరగకుండా ఆలయ అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.