Uber: ఫ్లయిట్ మిస్సయితే పరిహారం... ఉబర్ ఆకర్షణీయ స్కీం

- విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం
- రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం
- ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం
ముంబైలో తమ క్యాబ్ లలో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు విమానం ఆలస్యమైతే రూ.7,500 వరకు పరిహారం అందించే 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' పథకాన్ని క్యాబ్ సంస్థ ఉబర్ ప్రారంభించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
సమయానికి విమానాశ్రయానికి చేరుకోవడం చాలా ముఖ్యమని, ట్రాఫిక్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబర్ తెలిపింది.
ఈ పరిహారం పొందడానికి, రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్, తిరిగి బుక్ చేసుకున్న టికెట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాబ్ ప్రయాణంలో ప్రమాదం జరిగితే, వైద్య ఖర్చులను కూడా ఉబర్ భరిస్తుంది.