Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

- నిన్న జయకేతనం సభలో హిందీ భాషపై పవన్ స్పందన
- పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్
- పవన్ ను విమర్శిస్తేనే నీకు ప్రచారం వస్తుందంటూ ప్రకాశ్ రాజ్ పై విష్ణు ఫైర్
హిందీ భాష వద్దు కానీ... హిందీ భాషలో సినిమాలు విడుదల చేసుకోవడం ద్వారా లభించే డబ్బు మాత్రం కావాలా? అంటూ నిన్న తమిళ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పవన్ వ్యాఖ్యలకు ఇవాళ నటుడు ప్రకాశ్ రాజ్ బదులివ్వడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ గారిని విమర్శిస్తే నీకు ప్రచారం వస్తుంది అంటూ ప్రకాశ్ రాజ్ పై ధ్వజమెత్తారు.
"మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే... కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేయడమే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు... కానీ నీలాంటి వాళ్లు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గు చేటు" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.