Robinhood: 'రాబిన్‌హుడ్‌' నుంచి డేవిడ్ వార్న‌ర్ ఫస్ట్ లుక్ విడుద‌ల‌!

David Warner First Look Poster from Robinhood Film Out Now

  • నితిన్, వెంకీ కుడుముల కాంబోలో 'రాబిన్‌హుడ్‌'
  • మార్చి 28న విడుద‌ల కానున్న సినిమా
  • ఈ మూవీలో ప్ర‌త్యేక‌ పాత్ర‌లో స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్
  • ఆయ‌న తాలూకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్

టాలీవుడ్ యువ న‌టుడు నితిన్, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌'. 'భీష్మ' సినిమా త‌ర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చి 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్ నిర్వహిస్తున్నారు. 

అయితే, ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యేక‌ పాత్ర‌లో న‌టిస్తున్న‌ విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసింది. "బౌండ‌రీ నుంచి బాక్సాఫీస్‌కు వ‌స్తున్న వార్న‌ర్‌కు భార‌త సినిమాకు స్వాగ‌తం" అంటూ వార్న‌ర్‌ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను పంచుకుంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న‌ శ్రీలీల కథానాయికగా న‌టిస్తుంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.  

  • Loading...

More Telugu News