Gutta Jwala: నితిన్ కోసమే చేశా.. గుత్తా జ్వాల

Gutta jwala About Special Song appearence In Nitin Movie

  • గుండెజారి గల్లంతయ్యిందే సినిమా సాంగ్ పై వివరణ
  • నితిన్ పట్టుబట్టడంతో ఆ సాంగ్ లో నటించినట్లు వెల్లడి
  • తనవల్లే ఆ సినిమాపై నేషనల్ మీడియాలో చర్చ జరిగిందన్న జ్వాలా

బ్యాడ్మింటన్ లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తా జ్వాలా హీరో నితిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ తాను చేయడానికి కారణం హీరో నితన్ అని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలా ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్‌ కోసం, ఆయన పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశానని తెలిపారు. బ్యాడ్మింటన్ లో రాణిస్తుండగా, ఆ తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పారు. అయితే, తనకు సినిమాలపై ఆసక్తిలేదని సున్నితంగా తిరస్కరించానని వివరించారు.

సినిమా ఇండస్ట్రీలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, వారిని చూస్తే సినిమా రంగంలో ఎలా ఉండాలో తెలుస్తుందని గుత్తా జ్వాలా వివరించారు. సినిమాల్లో రాణించాలంటే సిగ్గు పడకూడదని, అది తనవల్ల కాదని చెప్పారు. ఎప్పుడో చేసిన సాంగ్ షూటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినా ఏదోలా అనిపిస్తుందని అన్నారు. చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుందని వివరించారు. తన మనస్తత్వానికి అది సరిపడదని తెలిపారు. బ్యాడ్మింటన్ లో పది గంటలు ప్రాక్టీస్ చేస్తే తర్వాత విశ్రాంతి తీసుకునే వీలుంటుందని, సినిమాల్లో అయితే 24 గంటలూ ఏదో ఒక పని ఉంటుందని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చారు.

సాంగ్ లో చేయడానికి కారణం ఇదే..
హీరో నితిన్ తనకు మంచి స్నేహితుడని గుత్తా జ్వాలా చెప్పారు. ఓసారి పార్టీ జరుగుతుండగా తన సినిమాలో సాంగ్ చేయాలని కోరాడన్నారు. అప్పుడు తప్పించుకోవడానికి సరే అన్నానని, పార్టీ ముగిశాక ఆ విషయమే మర్చిపోయానని తెలిపారు. అయితే, మూడు నెలల తర్వాత నితిన్ తన దగ్గర మళ్లీ ఆ సాంగ్ ప్రస్తావన తీసుకొచ్చాడని, సాంగ్ ఫైనల్ అయిందని, చిత్రీకరణ త్వరలో ప్రారంభిస్తాం రెడీగా ఉండాలని చెప్పాడన్నారు. అప్పుడు నేను చేయలేనని చెబితే నితిన్ ఒప్పుకోలేదని, సాంగ్ లో తాను ఉండాల్సిందేనని పట్టుబట్టాడని తెలిపారు. తాను ఆ సాంగ్ లో కనిపించడం వల్ల నేషనల్ మీడియాలో ఆ సినిమా గురించి ఆర్టికల్స్ వచ్చాయని, సినిమాకు మంచి ప్రచారం జరిగిందని గుత్తా జ్వాలా చెప్పారు.

  • Loading...

More Telugu News