Bandla Ganesh: ప్ర‌కాశ్ రాజ్‌కు బండ్ల గ‌ణేశ్ కౌంట‌ర్‌..?

Bandla Ganesh Indirectly Punches To Actor Prakash Raj

      


సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఇది న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కు కౌంట‌ర్‌గానే ట్వీట్ చేసిన‌ట్లు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. 

“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజ‌న్లు క‌చ్చితంగా ప్ర‌కాశ్ రాజ్‌ను ఉద్దేశించే గ‌ణేశ్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. 

ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు పాత విష‌యాల‌ను గుర్తు చేస్తున్నారు. మా ఎన్నిక‌ల స‌మ‌యంలో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్... విష్ణుకు కాకుండా ప్ర‌కాశ్ రాజ్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చారు. అలాంటి ప‌వ‌న్‌పై ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బండ్ల గ‌ణేశ్ తాజాగా కృత‌జ్ఞ‌త‌గా ఉండాలంటూ ట్వీట్ చేశార‌ని అంటున్నారు. 

కాగా, నిన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌కాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. బ‌హుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌కు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కౌంట‌ర్ ఇచ్చారు. హిందీ భాష‌ను త‌మ‌పై రుద్ద‌కండి అంటూ చెప్ప‌డం ఇంకో భాష‌ను ద్వేషించ‌డం కాద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. స్వాభిమానంతో త‌మ మాతృభాష‌ను, త‌ల్లిని కాపాడుకునే ప్ర‌య‌త్న‌మ‌నే విష‌యాన్ని ప‌వ‌న్‌ కు ద‌య‌చేసి ఎవ‌రైనా చెప్పాల‌ని ప్ర‌కాశ్ రాజ్ కోరారు.

More Telugu News