Donald Trump: ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

Canada PM Mark Carney counter to Donald Trump

  • కెనడాని విలీనం చేసుకుంటామని పదేపదే చెపుతున్న ట్రంప్
  • కెనడాపై గౌరవం చూపించాలన్న కెనడా ప్రధాని 
  • అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని వ్యాఖ్య

కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని... పొరపాటున కూడా ఆ ఆలోచన చేయవద్దని చెప్పారు. 

కెనడాపై అమెరికా గౌరవం చూపించాలని... అంతవరకు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం చూపితేనే తాను ట్రంప్ ను కలుస్తానని చెప్పారు. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం... కార్నీ-ట్రంప్ మధ్య చర్చల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News