Shivaji: నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

- హిట్ టాక్ ను తెచ్చుకున్న 'కోర్ట్' సినిమా
- మంగపతి పాత్ర తన కోసమే పుట్టిందని భావిస్తున్నానన్న శివాజీ
- నాని నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబు
ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన 'కోర్ట్' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమాపై నటుడు శివాజీ మాట్లాడుతూ... 'మంగపతి' పాత్ర తన కోసమే పుట్టిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ పాత్రతో తన 25 ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. నటుడిగా నిరూపించుకున్న నాని... ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో కూడా చొరవ చూపిస్తున్నారని అన్నారు. 'కోర్ట్' సినిమా బాగోకపోతే తన 'హిట్ 3' సినిమా చూడొద్దని నాని సవాల్ విసరడం మామూలు విషయం కాదని చెప్పారు.