Ganja: ఐస్‌క్రీమ్, కుల్ఫీలో గంజాయిని కలిపి విక్రయం... హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్

- నిందితుడిని అరెస్టు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- దూల్‌పేటలో హోలీ వేడుకలో గంజాయి ఐస్‌క్రీం, కుల్ఫీ విక్రయం
- గంజాయి బర్ఫీ, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నాడు. లోయర్ దూల్‌పేటలోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీటు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయితో సంబరాలు చేసుకున్నారు.
సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, కొన్ని సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీమ్, కుల్ఫీ విక్రయించే నిందితుడు, గంజాయితో వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.