Golden Temple: స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఇనుపరాడ్డుతో దుండగుడి దాడి

- ఈ దాడిలో ఐదుగురికి గాయాలైనట్లు వెల్లడించిన పోలీసులు
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు
పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు.
భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో గాయపడిన వారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.