Ranya Rao: కోర్టులో కన్నడ నటి రన్యా రావుకు చుక్కెదురు

- ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో రన్యా రావు బెయిల్ పిటిషన్
- రన్యా రావు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
- రెండో నిందితుడు తరుణ్ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యా రావుకు ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో రెండో నిందితుడు తరుణ్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారించనుంది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చేసిన విచారణలో రన్యా రావు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె చెప్పినట్లుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ కేసులో కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి స్మగ్లింగ్ దందాను నడిపిస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించి, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఎవరికైనా సీబీఐ సమన్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.