Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ

- వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు
- చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి
- సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ
వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు పలు డిమాండ్లపై ఇండియన్ బ్యాంకు అసోసియేషన్స్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులు, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్న అంశాలు యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ఉన్నాయి. ఆర్థిక సేవల విభాగం ఇటీవలి సూచనలను ఉపసంహరించుకోవాలని, ఇవి ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని యూఎఫ్‌బీయూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలని, పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలని తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది.