Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు

- నేడు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం
- పిఠాపురంలో 'జయకేతనం' పేరుతో భారీ సభ
- పవన్ కు, జనసైనికులను పురందేశ్వరి శుభాకాంక్షలు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూటమి పార్టీల నేతలు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ కు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
మరోవైపు, కాసేపటి క్రితం పవన్ కల్యాణ్ పిఠాపురంకు చేరుకున్నారు. గన్నవరం నుంచి పిఠాపురంకు ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. కాసేపట్లో ఆయన జనసేన ఆవిర్భావ సభ వేదికకు చేరుకుంటారు. 90 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగనుంది.