Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

Police questioned BRS MLC Pochampalli Srinivas Reddy

  • ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడిపందేలు
  • 61 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఈరోజు విచారణకు హాజరైన పోచంపల్లి

మొయినాబాద్ తొల్కట్ట గ్రామంలోని ఫామ్ హౌస్ లో కోడిపందేలు, కేసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డి విచారణకు న్యాయవాదితో పాటు, తన ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్న వ్యక్తిని తీసుకువచ్చినప్పటికీ వారిని పోలీసులు లోపలకు అనుమతించలేదు. 

గత నెల 11న పోచంపల్లికి చెందిన ఫామ్ హౌస్ లో కోడిపందేలు, కేసినో నిర్వహిస్తున్నారనే సమాచారంలో పోలీసులు దాడి చేశారు. 61 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఈరోజు ఫామ్ హౌస్ యజమాని అయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

Pochampalli Srinivas Reddy
BRS
  • Loading...

More Telugu News