Janasena: పిఠాపురం జనసంద్రం... కాసేపట్లో జనసేన 'జయకేతనం' సభ

- పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ
- తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికుల రాక
- 1,700 మంది పోలీసులతో భారీ భద్రత
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడలో కాసేపట్లో ప్రారంభం కానుంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో జనసైనికులు పిఠాపురంకు తరలివచ్చారు. భారీగా వచ్చిన జనసైనికులతో పిఠాపురం జనసంద్రంగా మారింది.
సభా ప్రాంగణం స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. ఆరు చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, నాలుగు చోట్ల భోజన వసతులు, ఏడు చోట్ల వైద్య శిబిరాలు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. 1,700 మంది పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. వీరికి సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపట్లో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడకు చేరుకోనున్నారు.