Hyderabad: మార్చిలోనే మండుతోంది... 40 డిగ్రీల పైకి చేరుకున్న ఉష్ణోగ్రతలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

IMD says Maximum temperature above 40 in telangana

  • సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుందని వెల్లడి
  • రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వెల్లడి
  • హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతోందన్న వాతావరణ కేంద్రం

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 40 డిగ్రీల పైకి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. శనివారం మరో ఏడు జిల్లాల్లోను 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఈ జిల్లాలకూ ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

Hyderabad
IMD
Telangana
  • Loading...

More Telugu News