Meruga Nagarjuna: సకల శాఖా మంత్రి నారా లోకేశ్ అంటూ మేరుగ నాగార్జున విమర్శలు

Meruga Nagarjuna comments on Nara Lokesh

  • విద్యాశాఖను లోకేశ్ భ్రష్టు పట్టించారన్న మేరుగ నాగార్జున
  • పుస్తకాలపై జగన్ ఫొటోలను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా
  • వీసీలను భయపెట్టి రిజైన్ చేయించారని మండిపాటు

ఏపీ మంత్రి నారా లోకేశ్ సకల శాఖా మంత్రిగా పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పుస్తకాలపై జగన్ ఫొటోలు ఉన్నాయని ఓర్వలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్ కు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. 

పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ హయాంలో ఉన్నత విద్యను క్వాలిటీతో అందించామని చెప్పారు. యూనివర్సిటీల వీసీలను భయపెట్టి రిజైన్ చేయించారని... విద్యా వ్యవస్థను నడిపించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వర్సిటీల్లో నిబంధనలకు నీళ్లు వదిలారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News