Pawan Kalyan: జనసేన ఆవిర్భావ సభకు బయల్దేరిన పవన్ కల్యాణ్

Pawan Kalyan off to Pithapuram to attend Jayakethanam rally

  • నేడు పిఠాపురం నియోజకవర్గంలో  జనసేన ఆవిర్భావ సభ
  • హాజరుకానున్న పవన్ కల్యాణ్
  • హైదరాబాద్ నుంచి పయనం

ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. 'జయకేతనం పేరిట జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాదులోని తన నివాసం నుంచి బయల్దేరారు. 

ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే, అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. పవన్ వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన సోషల్ మీడియా వింగ్ జనసేన శతఘ్ని పంచుకుంది. 

More Telugu News