Mallareddy: హోలీ వేడుకల్లో మనుమరాళ్లతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్.. వీడియో వైరల్!

డ్యాన్స్, స్పీచ్‌లతో అలరించే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రంగులు పూస్తూ, కాసేపు మనుమరాళ్లను తన భుజాలపై మోసుకొని మాజీ మంత్రి డ్యాన్స్ చేశారు. ఇలా సరదాగా నృత్యం చేసి, డప్పు కొడుతూ స్థానికులు, పిల్లలను ఆయన ఉత్సాహపరిచారు. మల్లారెడ్డి హోలీ సంబరాల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.