IML 2025: ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ టీ20.. సెమీస్‌లో ఆసీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

Yuvraj Singh Smashes 7 sixes as India Masters thrash Australia Masters in Semis of IML 2025

  • 94 ర‌న్స్ తేడాతో ఆసీస్‌ను మట్టిక‌రిపించి ఫైన‌ల్‌కి దూసుకెళ్లిన ఇండియా
  • నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగుల భారీ స్కోర్ చేసిన భార‌త్‌
  • ల‌క్ష్యఛేదన‌లో 126 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైన కంగారూలు 
  • 30 బంతుల్లోనే 59 ప‌రుగులతో యువ‌రాజ్ విజృంభ‌ణ‌  

ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ టీ20 సెమీఫైన‌ల్‌ల్లో ఆస్ట్రేలియా మాస్ట‌ర్స్‌పై ఇండియా మాస్ట‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 94 ర‌న్స్ తేడాతో ఆసీస్‌ను మట్టిక‌రిపించి ఫైన‌ల్‌కి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్ట‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 

యువ‌రాజ్ సింగ్ 30 బంతుల్లోనే 59 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 సిక్స‌ర్లు, ఒక ఫోర్ న‌మోదు కావ‌డం విశేషం. యువీ తోడుగా కెప్టెన్ స‌చిన్ టెండూల్క‌ర్ (42), స్టువర్ట్ బిన్నీ (36) కూడా బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టారు. ఇక 221 ప‌రుగుల భారీ ల‌క్ష్యచేధ‌న‌లో కంగారూలు 126 ర‌న్స్‌కే ప‌రిమిత‌య్యారు. 

ఆస్ట్రేలియా మాస్ట‌ర్స్ బ్యాట‌ర్ల‌లో షాన్ మార్ష్ (21), బెన్ డంక్ (21), నాథన్ రియర్డన్ (21) ప‌రుగులు చేయ‌గా.. టోర్నీలో వ‌రుస శ‌త‌కాల‌తో రెచ్చిపోయిన ఆసీస్ మాజీ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ షేన్ వాట్సన్ (5) నిరాశ‌ప‌రిచాడు. దీంతో ఇండియా మాస్ట‌ర్స్ 94 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్లు న‌దీమ్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... ఇర్ఫాన్ ప‌ఠాన్, విన‌య్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. 

  • Loading...

More Telugu News