Jagan: జగన్ ను కలిసిన పిన్నెల్లికి చెందిన 400 కుటుంబాలు

- పిన్నెల్లిలో 400 వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలపై గ్రామ బహిష్కరణ
- ఛలో పిన్నెల్లికి సిద్ధమవుతున్న వైసీపీ
- అందరికీ పార్టీ అండగా ఉంటుందన్న జగన్
వైసీపీ అధినేత జగన్ ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. గ్రామంలోని 400 సానుభూతిపరుల కుటుంబాలపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు. ఇదే అంశంపై వైసీపీ హైకోర్టులో పోరాడుతోంది. ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైసీపీ సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా పిన్నెల్లి గ్రామం వైసీపీ సానుభూతిపరులతో జగన్ మాట్లాడుతూ... పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని జగన్ కు వారు చెప్పారు. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని జగన్ అన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామస్తులు జగన్ ను కలిశారు. చెన్నాయపాలెం, మాదెనపాడు, తురకపాలెం గ్రామాలకు చెందిన మరికొందరు కూడా జగన్ ను కలిశారు.