Half Day Schools: ఒంటిపూట బ‌డుల‌పై తెలంగాణ విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Key Update on Half Day Schools in Telangana

  • ఈ నెల 15 నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభమ‌వుతాయ‌న్న విద్యాశాఖ‌
  • ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు బ‌డులు
  • ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ ప‌రిధిలోని అన్ని ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త, ఉన్న‌త పాఠ‌శాల‌లకు ఆదేశాలు 
  • మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌ట‌న‌

ఒంటిపూట బ‌డుల‌పై తెలంగాణ పాఠ‌శాల‌ విద్యాశాఖ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభమ‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, ఎయిడెడ్ ప‌రిధిలోని అన్ని ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త, ఉన్న‌త పాఠ‌శాల‌లు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వ‌ర‌కు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఆదేశాల‌ను అన్ని మేనేజ్‌మెంట్లు అమ‌లు చేసేలా పాఠ‌శాల విద్యాశాఖ రీజిన‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. 

కాగా, ప‌దో త‌ర‌గ‌తి బోర్డు ఎగ్జామ్స్ కు విద్యార్థుల‌ను స‌న్న‌ద్ధం చేసేందుకు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ తెలిపారు. అలాగే ఎస్ఎస్‌సీ ప‌రీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ మాత్రం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని చెప్పారు. ఇక పిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం 12.30 గంట‌ల‌కు అందించి ఇంటికి పంపించ‌నున్నారు.      

  • Loading...

More Telugu News