Chandrababu: నన్ను ప్రపంచబ్యాంకు జీతగాడు అన్నారు: చంద్రబాబు

Chandrababu on electricity reforms

  • విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్న చంద్రబాబు
  • దేశంలో కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని వెల్లడి
  • 1988లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామన్న సీఎం

విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని... విద్యుత్ రంగాన్ని జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ మిషన్ గా విభజించామని చెప్పారు. ఎనర్జీ ఆడిటింగ్ ను తీసుకొచ్చామని... దేశంలో కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని తెలిపారు. అసెంబ్లీలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. 

వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ కు ఛార్జీలను యూనిట్ చొప్పున వసూలు చేసే పరిస్థితి ఉండేదని... ఆ పరిస్థితి నుంచి శ్లాబ్ రేటుతో రైతులను ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉండేదని... 2014 డిసెంబర్ కు ఎక్కడా కరెంట్ కొరత లేకుండా చేశామని, 2018 నాటికి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని గర్వంగా చెపుతున్నానని అన్నారు. మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చామని తెలిపారు. తనను ప్రపంచబ్యాంకు జీతగాడు అని విమర్శలు చేశారని చెప్పారు. 

  • Loading...

More Telugu News