KTR: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్... పిచ్చి కుక్క అంటూ ట్వీట్

KTR fires on Revanth Reddy

  • స్టేచర్ ఉందని విర్రవీగినవాళ్లనుస్ట్రెచర్ మీదకు పంపారన్న రేవంత్ రెడ్డి
  • ఇంకా ఇలాగే చేస్తే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు
  • ఈ పిచ్చి కుక్క అన్ని హద్దులు  దాటేస్తోందంటూ కేటీఆర్ విమర్శలు 

మీకు మీరే స్టేచర్ ఉందనుకుంటే ఎట్లా? స్టేచర్ ఉందని విర్రవీగిన వాళ్లను స్ట్రెచర్ మీదకు పంపించారు, ఇలానే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు అటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 

రేవంత్ వ్యాఖ్యల వీడియోను పంచుకున్న కేటీఆర్... ఈ పిచ్చి కుక్క సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను దాటేసింది అంటూ ఘాటుగా స్పందించారు. 

"నేను అతడి కుటుంబ సభ్యులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే... వీలైనంత త్వరగా అతడిని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లండి. ఎందుకంటే అతడి పిచ్చి బాగా ముదిరిపోయింది... చివరికి తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కరవడం ప్రారంభిస్తాడు" అంటూ ట్వీట్ చేశారు.

KTR
Revanth Reddy
KCR
BRS
Congress

More Telugu News