Chain Snatching: మంచినీళ్లు కావాలని అడిగి మంగళసూత్రం లాక్కెళ్లాడు... వీడియో ఇదిగో!

హైదరాబాదులో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ మంచినీళ్లు కావాలని అడిగి, మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లాడు. కేపీహెచ్ బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉదయం వేళ ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటోంది. ఇంతలో ఓ వ్యక్తి ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి, మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటి లోపలికి వెళ్లగానే, ఆ వ్యక్తి కూడా గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కుని, పరారయ్యాడు. మహిళ అరుచుకుంటూ బయటికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మంగళసూత్రం రెండున్నర తులాలు ఉంటుందనిభావిస్తున్నారు.