Nitish Kumar: బీహార్ శాసనమండలిలో... నితీశ్ కుమార్ Vs రబ్రీదేవి

- నితీశ్, రబ్రీదేవి మధ్య వాగ్వాదం
- రాష్ట్రం కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న నితీశ్
- విపక్షాలతో కలిసి వాకౌట్ చేసిన రబ్రీదేవి
బీహార్ శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్రీదేవి (లాలూ ప్రసాద్ అర్ధాంగి) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్జేడీ మిత్రపక్షమైన సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్సీ శశి యాదవ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. సమాధానంపై స్పందించిన రబ్రీదేవి... ప్రభుత్వ సమాధానం సరిగా లేదని అన్నారు.
దీంతో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎంతో చేసిందని... గతంలోని ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం మహిళలకు ఎంతో చేసిందని... వారు మహిళల కోసం ఏం చేశారని నితీశ్ ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ సమస్యల్లో ఉన్నప్పుడు ఆమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రబ్రీ మండిపడ్డారు. విపక్షాలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.